Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై బొత్స ఆగ్రహం..! 20 d ago
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అడ్డుగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక్క యూనిట్ కి రూ.2 చొప్పున పెరిగితే సామాన్యుడికి భారంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 70వేల కోట్ల అప్పు చేసిందని దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. ట్రూ అప్ చార్జీలను సబ్సిడీగా ప్రకటించాలన్నారు.